YCP MLA car accident: వైసీపీ ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్.. ముగ్గురికి గాయాలు - Sri Sathya Sai District accidents News
YCP MLA car accident at Madakasira Govt Hospita: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే తిప్పేస్వామి కారు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్యే కారును.. డ్రైవర్ యూటర్న్ తీసుకుంటుండగా బైక్‌పై అతివేగంగా వచ్చిన ఓ ముగ్గురు యువకులు ఢీకొట్టి ఆసుపత్రి పాలైయ్యారు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మడకశిర ప్రభుత్వాసుపత్రి వద్ద ప్రమాదం.. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈరోజు ఎమ్మెల్యే తిప్పేస్వామి కారును డ్రైవర్ యూటర్న్ తీసుకుంటుండగా.. అటునుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా ఢీకొట్టారు. దీంతో ఆ ముగ్గురు యువకులు ఒక్కసారిగా గాల్లో ఎగిరి కిందపడ్డారు. గమనించిన చుట్టుప్రక్కల స్థానికులు.. హూటాహూటిన ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన ఆ ముగ్గురు యువకులను ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. అయితే, ప్రమాద జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేరని, కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడని పోలీసులు తెలిపారు.
యువకులకు స్వల్ప గాయాలు.. అనంతరం ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులలో ఒకరికి కాలుకు తీవ్రమైన గాయమైందని.. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలియజేశారు. ప్రమాదానికి సంబంధించి.. సీసీ టీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ప్రమాదంలో గాయపడిన ఆ ముగ్గురు యువకులు ఎవరు..? ఎక్కడి వారు..? అనే తదితర వివరాలు తెలియాల్సి ఉంది.