ఆంధ్రప్రదేశ్

andhra pradesh

aisf_demands_that_students_hostel_issues_be_resolved

ETV Bharat / videos

విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి - మెస్ ఛార్జీలను విడుదల చేయాలి : ఏఐఎస్ఎఫ్ - విజయవాడలో ఏఐఎస్ఎఫ్ 28వ నగర మహాసభ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 7:44 PM IST

AISF Demands That Students Hostel Issues Be Resolved: విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామన్న డిమాండ్ చేశారు. విజయవాడలో ఏఐఎస్ఎఫ్ 28వ నగర మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామన్న మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే అధికారులు స్పందించి మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. 

సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండింగ్​లో ఉన్న మెస్ ఛార్జీలను విడుదల చేయాలని ఆయన కోరారు. పాఠశాలల్లో ఇతర విద్యారంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొక్కుబడిగా ఏపీపీఎస్సీ(Andhra Pradesh Public Service Commission) నోటిఫికేషన్ ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని రామన్న తెలిపారు. ఆన్​లైన్​ అడ్మిషన్స్​ ప్రక్రియ పాత పద్ధతిలోనే కొనసాగించాలన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details