వావ్ నేవీ: కళ్లు చెదిరేలా మలబార్ 2020 రెండో దశ విన్యాసాలు - విశాఖ తాజా వార్తలు
మలబార్ 2020 , రెండో దశ విన్యాసాలు విశాఖ హిందూ మహాసముద్రంలో జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుకలో భారత్, యూఎస్ఎ, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు పాల్గొన్నాయి. సాంకేతికంగా అత్యున్నతస్థాయి ప్రమాణాలతో ఈ విన్యాసాలు సాగుతున్నాయి. భారత్కు చెందిన మిగ్ 29కె విమానాలు, అమెరికాకు చెందిన ఎఫ్18 యుద్ధ విమానాలు తమ బలాలు ప్రదర్శించాయి. అమెరికాకు చెందిన ఏఈ డబ్ల్యూ ఎయిర్ క్రాఫ్ట్, ఈ2సీ హెకేవ్ లోహ విహంగాలు పాల్గొన్నాయి. శత్రు స్థావరంపై దాడి చేసి తిరిగి వేగంగా గమ్యాన్ని చేరుకోవడం వంటి విన్యాసాలు ప్రదర్శించాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, గాలిలోనే శత్రువుపై దాడి చేసి వారి లక్ష్యాన్ని ఛేదించే ప్రదర్శన చేయనుంది. అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ హవాక్, ఎయిర్ క్రాప్ట్ పి 81, డోర్నియర్ ఎయిర్ క్రాప్ట్ సహా పలు హెలికాప్టర్లు క్రాస్ డెక్ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయి. ఈ నెల 17న ప్రారంభం అయిన రెండో దశ విన్యాసాలు నేటితో ముగియనున్నాయి.
Last Updated : Nov 20, 2020, 5:10 PM IST