దేశంలో వ్యక్తిగత గోప్యతకు భద్రత ఉందా? - ప్రతిధ్వని
"పెగాసస్" స్పైవేర్. ఇప్పుడు దేశం మొత్తం ఇదే దుమారం. దేశంలో సుమారు 300మంది ప్రముఖుల ఫోన్లు హ్యాకయ్యాయనే వార్త కలకలమే రేపుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సైతం ఇదే అంశం కేంద్రంగా వాడీవేడీగా మారాయి. హ్యాకింగ్‌పై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేస్తుంటే... కేంద్రప్రభుత్వం మాత్రం ఈ వ్యవహారంతో తమకు కానీ, భారతీయ జనతాపార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. అసలేంటీ... ఈ పెగాసస్ స్పైవేర్...? ఈ స్థాయిలో చర్చకు దారి తీయటానికి కారణాలేంటి? రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిశోర్ లాంటి ప్రముఖులతో పాటు... ఫోన్ హ్యాకింగ్ గురైన జాబితాలో ప్రస్తుత కేంద్ర మంత్రులు సైతం ఉండటం దేనికి సంకేతం..? ఇదే అంశంపై ప్రతిధ్వని....