తిరుమలలో జలపాతాల హోయలు.. జలమయమైన రహదారులు - తిరుమలలో వర్షం వార్తలు
నివర్ తుపాను ప్రభావం తిరుమల కొండపై అధికంగా ఉంది. జలశయాలన్ని పొంగిపొర్లగా..గిరులపైనున్న జలపాతాల నుంచి నీరు కిందకు దూకుతోంది. తిరుపతి పట్టణంలో రోడ్లన్నీ జలమయంకాగా...కొండ ఘాట్ రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో ..ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.