TIRUMALA: సింహ వాహనంపై అభయమిచ్చిన మలయప్పస్వామి - తిరుమల బ్రహ్మోత్సవం 2021
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు మలయప్పస్వామి సింహవాహనంపై విహరించారు. యోగ నృసింహుడిగా సింహ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. జగన్నాయకుడి అవతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతం ఈ సింహవాహనం. సింహవాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.