మా బాబుకి 13, హైపరాక్టివ్. నాలుగేళ్లప్పుడు మూర్ఛ వస్తే మందులు వాడాం. డాక్టరు సలహాతో తర్వాత ఆపేశాం. మాటిమాటికీ అరుస్తాడు, అబద్ధాలాడతాడు. ఇదీ వంశపారంపర్యమా? స్కూల్లో దొంగిలించాడని ఫిర్యాదు. ఇంట్లోనూ డబ్బు దొంగిలిస్తే తప్పని చెప్పా. ఎప్పుడూ ఫోనే. వాణ్ని మార్చేదెలా? - ఒక సోదరి
శారీరక పోలికల్లాగే మానసిక లక్షణాలూ అమ్మవైపు, నాన్నవైపు నుంచి వస్తాయి. అలా వచ్చినంతలో మారరని కాదు. వంశపారంపర్యంగా వచ్చే గుణాలతోబాటు చుట్టుపక్కల పరిసరాల ప్రభావమూ ఉంటుంది. మీ అబ్బాయికి చిన్నతనంలోనే మూర్ఛవ్యాధి రావడం, దానికి మందులు వాడటంతో మెదడుపై ప్రభావం పడింది. కోపం, చిరాకు, అసహనం, మొండితనం.. లాంటివన్నీ మూర్ఛవల్ల వచ్చే ప్రవర్తన సమస్యలు. మాట వినకపోవడానికి యుక్తవయసు కూడా కారణం.