ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఓటు' వేయలేదని.. తెదేపా మద్దతుదారులపై దాడి..! - రాయచోటి రాజకీయ వివాదాలు తాజా వార్తలు

కడప జిల్లా రాయచోటి మండలం పెమ్మాడపల్లిలో తెదేపా శ్రేణులపై.. వైకాపా కార్యకర్తలు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

ysrcp leaders attack tdp leaders at rayachoti
ysrcp leaders attack tdp leaders at rayachoti

By

Published : Mar 2, 2021, 10:10 AM IST

కడప జిల్లా రాయచోటి మండలం పెమ్మాడపల్లిలో తెదేపా మద్దతుదారులపై.. వైకాపా మద్దతుదారులు సోమవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారు అభ్యర్థికి ఓటు వేయలేదని దాడిచేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ ఘటనలో గాయపడినవారిని స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామసుబ్బమ్మ, ఆంజనేయులు అనే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని కడపకు తరలించారు.

ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ రాజు పేర్కొన్నారు. దళితులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వైకాపా కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఐఎఫ్​ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శెట్టిపల్లి సాయి కుమార్ డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details