YSR Kadapa District Court refuses bail to Dasthagiri in atrocity case:మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారినందుకే తన భర్తను, తీవ్రంగా వేధిస్తున్నారని దస్తగిరి భార్య షబానా ఆరోపించారు. అట్రాసిటీ కేసులో అరెస్టై, 50రోజులుగా కడప కేంద్ర కారాగారంలో ఉన్న దస్తగిరితో ములాఖత్ తర్వాత ఆమె మాట్లాడారు. తన భర్తకు బెయిల్ రాకుండా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. వివేకా కేసులో రాజీకి రావాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించారు.
మొద్దు శీనులాగా తన భర్తను కూడా జైల్లో హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని దస్తగిరి భార్య ఆందోళన
మీడియాతో మాట్లాడిన దస్తగిరి భార్య షబానా: వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవరుగా మారినందుకే వైసీపీ పెద్దలు తన భర్తనుతీవ్ర స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నారని, దస్తగిరి భార్య షబానా ఆరోపించారు. ఎర్రగుంట్ల పోలీసులు నమోదు చేసిన అట్రాసిటీ కేసులో అరెస్ట్ అయిన దస్తగిరి 50 రోజులుగా కడప జైల్లో ఉన్నారు. ఇవాళ ఆయన బెయిల్ పిటిషన్ కూడా కడప కోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంలో ఆయన భార్య షబానా కడప జైల్లో ఉన్న దస్తగిరిని ములాఖత్ లో కలిశారు. అనంతరం షబానా మీడియాతో మాట్లాడారు. తన భర్త బెయిల్ పై బయటకు రాకుండా అనేక తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, షబానా కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త అప్రూవర్ గా మారిన తర్వాత రాజీ కావాలని పులివెందుల కు చెందిన వైసీపీ నాయకులు డబ్బులు ఆశ చూపడం లేదంటే బెదిరించడం చేస్తున్నారని షబానా ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు ఎన్ని కుట్రలు పన్నిన వెనక్కి తగ్గడం లేదనే ఉద్దేశంతోనే జైలులో పెట్టి ఇబ్బందులు చేస్తున్నారని ఆమె వాపోయారు.