రాష్ట్రంలో 60 శాతం సీట్లు యువతకు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ మార్గదర్శకాల మేర ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏపీలో 100 సీట్లు యువతకు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా యాత్ర మూడో రోజు కడప జిల్లాలో కొనసాగుతోంది. మైదుకూరు, కడప, రాయచోటి, నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతోంది. ఈ యాత్రలో భాగంగా కడప ఏడురోడ్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో నేతలు రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు పాల్గొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రజలకు వివరించాల్సిందిగా రఘువీరారెడ్డి కార్యకర్తలను కోరారు.
'హస్తం' అభ్యర్థుల్లో యువతకే పెద్దపీట - రఘువీరారెడ్డి
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తామని రాహుల్ గాంధీ భరోసా నిచ్చారని, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో యువతకు 100 సీట్లు కేటాయిస్తామన్నారు.
ప్రత్యేక హోదా భరోసా యాత్ర
తెదేపా, వైకాపా ప్రైవేటు వ్యక్తులనికేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పార్టీ ఆయన అన్నారు.
Last Updated : Feb 21, 2019, 10:51 PM IST