రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సున్నితమైన నీటి విషయాన్ని సామరస్యంగా పరిష్కరించాల్సి ఉండగా... తెలంగాణ మంత్రులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మంచిది కాదని వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రయ్య (MLC ramachandraiah) అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో (huzurabad bypoll) లబ్ధి పొందేందుకే తెలంగాణ మంత్రులు పొందేందుకే అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటి కన్నా ఒక్క చుక్కైనా ఎక్కువ వినియోగించట్లేదని స్పష్టం చేశారు.
రాజకీయాలకోసం ప్రజలను రెచ్చగొట్టొద్దు..
వైఎస్.రాజశేఖర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr).. ఇలాంటి వ్యాఖ్యలకు తావు ఇవ్వకుండా చూసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. ఆ ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కాదా అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా వై.ఎస్.ఆర్.. జలయజ్ఞం ప్రాజెక్టులు చేపట్టారని గుర్తు చేశారు. అక్కడి ప్రజలను రెచ్చగొడితే.. ఈ ప్రాంత ప్రజలు కూడా రెచ్చిపోతారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాయలసీమకు అన్యాయం చేసే విధంగా తెలంగాణ వ్యవహరించడం సరికాదన్నారు.
ఇదీ చదవండి
RRR LETTER: లోక్‌సభ స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరోలేఖ