స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ.. ఉద్రిక్తంగా మారింది. కడప జిల్లా చాపాడులో వైకాపా నాయకులు.. తెదేపా అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. మండలంలోని వెదురూరు, లక్ష్మీపేట, చీపాడు ప్రాదేశిక నియోజకవర్గాల నాయకుల నామినేషన్ పత్రాలను చింపేశారు. గ్రామాల నుంచి తరలి వచ్చిన అభ్యర్థులను అడ్డుకున్నారు. ఈ కారణంగా.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల మధ్య దాడులు జరిగాయి. పోలీసులు ఉండగానే.. వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
నామినేషన్ల ప్రక్రియలో ఉద్రిక్తత.. అడ్డుకుంటున్న వైకాపా నేతలు - issues at munciapl elections
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్శంగా.. కడప జిల్లా చాపాడులో వైకాపా నాయకులు, వారి ప్రత్యర్థులకు మధ్య మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.

పోలీసుల ఎదుటే అభ్యర్థులపై వైకాపా దౌర్జన్యం
పోలీసుల ఎదుటే అభ్యర్థులపై వైకాపా దౌర్జన్యం
ఇదీ చూడండి: