మద్యం గోదాం మేనేజర్ తన ఇష్టానుసారంగా బీర్లను విక్రయిస్తున్నారని మద్యం దుకాణ యజమానులు వాగ్వాదానికి దిగారు. కేవలం ఒకే దుకాణానికి బీర్లు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. కడపలో ఇటీవలి కాలంలో బీర్ల కొరత ఏర్పడింది. సరైన సరఫరా లేక.. ఉన్న బీర్లను నిష్పత్తి ప్రకారం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. డిపో మేనేజర్ చిన్నయ్య కేవలం ఒక దుకాణానికి మాత్రమే బీర్లు సరఫరా చేశాడని దుకాణదారులు గోదాం వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. తమ షాపుల్లో బీరు లేక ఇబ్బంది పడుతుంటే కేవలం ఒకే షాప్ కు బీర్లు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దుకాణదారులతో లాలూచీ పడి బీరు ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా ఇలాగే చేశారని.. ఉన్నతాధికారులు ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
కడపలో బీర్ల 'పంచాయితీ'... డిపోలో వాగ్వాదం! - clash
కడపలో మద్యం డిపో మేనేజర్‌తో దుకాణదారులు వాగ్వాదానికి దిగారు. మేనేజర్ తన ఇష్టానుసారం బీర్లను విక్రయిస్తున్నారని ఆరోపించారు.
వాగ్వాదం