కడప జిల్లా అట్లూరు మండలం రాజుపాలెంలో దారుణం జరిగింది. అక్కడి వీఆర్ఏ దారుణ హత్యకు గురయ్యారు. సొంత పొలంలోనే.. దుండగుల చేతిలో హతమయ్యారు. ఈ పరిస్థితుల్లో.. స్థానిక మహిళలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పొలానికి వెళ్లాలన్నా భయపడుతున్నారు.
వీఆర్ఏ దారుణహత్య... గ్రామంలో భయాందోళనలు - cadapa
కడప జిల్లాలో తన సొంత పొలంలోనే వీఆర్ఏ ఓబులమ్మను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలో అట్లూరు గ్రామంలో మహిళలు పొలం పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.
vra-mudder-in-cadapa
అట్లూరు, బద్వేలు మండలాల సరిహద్దు గ్రామమైన రాజుపాలెంలో.... సొంత పొలంలోనే ఓబులమ్మ దారుణహత్యకు గురవడం.. 2 మండలాల్లో సంచలనం సృష్టించింది. తమకు రక్షణ కల్పించడమే కాక... పాటు హంతకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.