ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనాథలకు అండగా.. వివేకానంద ఫౌండేషన్‌ - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

Vivekananda Foundation in Kadapa District: రోడ్లపై మతిస్థిమితం లేని వారు కనపడితే చాలామంది పక్కకు తప్పుకుని వెళ్లిపోతారు. కానీ ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రం వారికి అన్నీ తానై సపర్యలు చేసి ఆప్యాయంగా పలకరిస్తోంది. అనాథలు కనిపిస్తే తాము అండగా ఉంటామని చెబుతూ వారి కడుపు నింపుతోంది.. కడప జిల్లాలోని వివేకానంద ఫౌండేషన్‌..

Vivekananda Foundation
వివేకానంద ఫౌండేషన్‌

By

Published : Dec 11, 2022, 3:12 PM IST

అనాథలకు అండగా వివేకానంద ఫౌండేషన్‌

Vivekananda Foundation in Kadapa District: వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం తెల్లపాడుకు చెందిన పాపిజెన్ని రామకృష్ణారెడ్డి.. ప్రొద్దుటూరులో రైల్వే గేట్‌ మేన్‌గా పని చేస్తున్నారు. 2010 జనవరి 12న స్వామి వివేకానంద స్ఫూర్తితో.. ఆయన వివేకానంద ఫౌండేషన్‌ను స్థాపించారు. పన్నెండేళ్లుగా జిల్లా వ్యాప్తంగా.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వృద్ధులు, నిరాశ్రయులకు అండగా నిలుస్తూ.. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. వృద్ధులకు వైద్యం చేయించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అనాథల కోసం కాశినాయన మండలం ఓబులాపురంలో దాతల సాయంతో సేవాశ్రమాన్ని నిర్మించారు. మతిస్థిమితం లేని వ్యక్తులు ఎదురైతే వారిని దగ్గరికి తీసుకుంటున్నారు. అనాథలకు ఆశ్రయమిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు..

రామకృష్ణారెడ్డి చేసే కార్యక్రమాలను చూసి మరికొందరు యువకులు ఆయన అండగా నిలిచారు. సంస్థ సభ్యులతో కలిసి సేవ‌లందిస్తున్నారు. అనాథలకు, నిరాశ్రయులకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు. వివేకానంద ఫౌండేషన్‌లో పనిచేయడంపై.. హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ స‌భ్యులు, ఫౌండేష‌న్ సిబ్బంది స‌హ‌కారంతో.. తాను చేస్తున్న సేవా కార్యక్రమాల‌ను ఇలాగే కొన‌సాగిస్తాన‌ని రామ‌కృష్ణారెడ్డి చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details