కడపజిల్లాలో గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా లక్షా 44 వేల మంది అభ్యర్థులు గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు రాస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సెప్టెంబరు 1వ తేదీన లక్ష మంది పరీక్ష రాస్తుండగా... వాటికోసం 300 కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. 7 వేల మంది సిబ్బంది పరీక్షల విధుల్లో పాల్గొంటారన్నారు. రేపు పరీక్షల మెటీరియల్స్‌ను ఆయా పోలీసు స్టేషన్లకు తరలించి భద్ర పరుస్తామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని సీసీ కెెమెరాల నిఘాతో పర్యవేక్షిస్తామని తెలిపారు. అభ్యర్థులెవరూ వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గ్రామ సచివాలయ పరీక్షలు కేవలం ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని... ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవని చెప్పారు. మధ్యవర్తులు మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి ఎవరూ మోసపోవద్దని హితవు పలికారు.
కడపజిల్లాలో సచివాలయ పరీక్షల విస్తృత ఏర్పాట్లు - గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణ
గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.
village secretariat examinations arrangements complited at kadapa district