కడప జిల్లాలో అక్రమ నిల్వలపై దాడులు - కడప
కడప జిల్లాలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 36 బస్తాల పచ్చి రొట్ట విత్తనాలను గుర్తించారు. సోదాలలో వ్యవసాయ అధికారులూ పాల్గొన్నారు.
vigilance-attack-in-cuddapah-godowns
కడప జిల్లా బద్వేలులోని డీసీఎంఎస్ గోదాములో కడప విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 36 బస్తాల పచ్చిరొట్ట విత్తనాలైన జిలుగులు, జనములు స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగు రోజులుగా బద్వేలు వ్యవసాయ కార్యాలయంలో విత్తనాల పంపిణీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పచ్చిరొట్ట విత్తనాలు నల్లబజారుకు తరలుతున్నాయన్న సమాచారంతో విజిలెన్స్ సిఐ నాగరాజు నేతృత్వంలో అధికారులు దాడులు నిర్వహించారు.