కడప జిల్లా జమ్మలమడుగు లో వెలసిన శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి కల్యాణం వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్రతువును తిలకించారు. తితిదే అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్వామివారి ఆలయ ఆవరణలో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వేడుకను చూడడానికి భక్తులు భారీగా హాజరయ్యారు.
కమనీయం.. రమణీయం.. శ్రీవారి పరిణయం - temple
జమ్మలమడుగులో వెలసిన శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి కల్యాణం కన్నుల పండువగా సాగింది.
కల్యాణం