ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో అమెరికా బృందం పర్యటన - కడప జిల్లాలో అమెరికా బృందం పర్యటన

ముగ్గురాయి గనిలో పుల్లరిన్ శాతం ఎంత ఉందో నిర్ధారించడానికి... అమెరికా బృందం కడప జిల్లాలోని ఏపీఎండీసీలో పర్యటించింది. ఈ పుల్లరిన్ వెలికితీస్తే అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

US team tour in Kadapa distri
కడప జిల్లాలో అమెరికా బృందం పర్యటన

By

Published : Jan 9, 2020, 10:35 AM IST

కడప జిల్లాలో అమెరికా బృందం పర్యటన

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటలోని ఏపీఎండీసీ ముగ్గురాయి గనిలో... పుల్లరిన్ ఎంత శాతం ఉందని నిర్ధారించడానికి అమెరికాకు చెందిన లైనెక్ బయోసైన్స్ సంస్థ సీఈవో డాక్టర్.శివరామకృష్ణ బృందం ఏపీఎండీసీలో పర్యటించింది. ఈ బృందంలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. 2007లో శాస్త్రవేత్తలు పుల్లరిన్ ఉందని నిర్ధారించినా ఇప్పటివరకు వెలికితీత పనులు ప్రారంభం కాలేదు.

డా.శివరామకృష్ణ సాంకేతికత ఉపయోగించి తక్కువ ఖర్చుతో వెలికితీయడానికి ముందుకొచ్చారు. మంగంపేట గనిలో ఏ మేరకు పుల్లరిన్ ఉందో పరిశీలించిన తర్వాత... ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. వెలికితీత పనులు ప్రారంభిస్తే ఇక్కడ అనేకమందికి ఉపాధి దొరుకుతుందన్నారు. పుల్లరిన్ చాలా విలువైన ఖనిజమని తెలిపారు. స్పేస్, నానో టెక్నాలజీల్లో ఇది ఉపయోగపడుతుందని వివరించారు.

ఇవీ చదవండి...ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం 'కార్టూన్​' అస్త్రం

ABOUT THE AUTHOR

...view details