సామాన్యులతో స్నేహభావాన్ని పెంపొందించేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు కేరళ పోలీసులు. పోలీసులు, ఠాణా అంటే చాలా మందికి గుబులే. ఈ భయాన్ని తొలిగించాలని తిరువనంతపురం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం స్టేషన్ గోడలపై కార్టూన్ చిత్ర పటాలను ఏర్పాటు చేశారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసమే..
పోలీస్ స్టేషన్‌ను సేవా కేంద్రంగా భావించాలనే వీరి ముఖ్య ఉద్దేశం. ఠాణాలో కార్టూన్లను చూస్తే వచ్చినవారి మనసు ఆహ్లాదంగా మారుతుందనేది పోలీసుల అభిప్రాయం. నెల రోజుల్లోగా అన్నీ ఠాణాల్లో కార్టూన్లను ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు.
ఇదీ చూడండి : చలిపులి నుంచి కాపాడే బాబా రామ్‌దేవ్ సూత్రాలు!