కడప జిల్లా వేముల మండలంలోని యురేనియం బాధిత గ్రామాలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల రాజ మోహన్ రెడ్డి అన్నారు. యురేనియం పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలకు ఎప్పటికైనా ముప్పు తప్పదని ...మరో 20 ఏళ్లలో బాధితులు తీవ్రస్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజారోగ్యంతో పాటు వాతావరణ కాలుష్యం దెబ్బతింటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం యురేనియం బాధిత గ్రామాల్లో జీవిస్తున్న ఒక్కో కుటుంబానికి 15 ఎకరాల భూమితో పాటు ప్రతి నెల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
"యురేనియం బాధిత గ్రామాలకు పరిహారం ఇవ్వాలి" - శాశ్వత పరిష్కారం
యురేనియం బాధిత గ్రామాలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల రాజమెహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి 15 ఎకరాల భూమితో పాటు ప్రతి నెల జీతం ఇవ్వాలని అన్నారు.
Uranium-affected villages to be compensated said bjp vice president of state