కడప జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘాట్ రోడ్డు మొదటి మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రామచంద్ర (32), ఈశ్వరమ్మ (60), నాగ శౌర్య (02) లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ దేవర ఈశ్వరమ్మ, బాలుడు దేవర నాగ శౌర్య మృతి చెందారని పోలీసులు తెలిపారు. మరో క్షతగాత్రుడు రామచంద్ర పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. వీరంతా సుండుపల్లి మండలం మడితాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి.. రామాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
DEAD: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరి పరిస్థితి విషమం - kadapa district news
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి