ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఆయుష్మాన్"కు రెండు జిల్లాల ఎంపిక - chitoor

పేద రోగులకు శుభవార్త... మన రాష్ట్రంలోని కడప, చిత్తూరు జిల్లాలు ఆయుష్మాన్ భవ పథకానికి ఎంపికయ్యాయి. ఆ వైద్యశాలల్లో ఇకపై మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.

ఆయుష్మాన్ పథకానికి కడప, చిత్తూరు జిల్లాలు ఎంపిక...
author img

By

Published : Jul 28, 2019, 1:01 PM IST

ఆయుష్మాన్ పథకానికి కడప, చిత్తూరు జిల్లాలు ఎంపిక...

రాష్ట్రంలోని ఆయుర్వేద వైద్యశాలలను ఆయుష్మాన్ భవ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటగా కడప, చిత్తూరు జిల్లాలో ఈ పథకం అమలు చేయనున్నారు. కడపలోని రిమ్స్ ఆయుర్వేద వైద్యశాల, చిత్తూరు జిల్లాలోని కుప్పం ఆయుర్వేద వైద్యశాలలు ఈ పథకం కింద ఎంపికైనట్లు సమాచారం. ఈ వైద్యశాలల్లో పంచకర్మ చికిత్స, యోగాల కోసం ప్రత్యేకించి భవన సముదాయం నిర్మించనున్నారు. తర్వాత జిల్లాలోని అన్ని ఆయుర్వేద వైద్యశాలలను ఈ పథకం కింద చేర్చి అభివృద్ధి చేసేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ అడుగులు వేస్తోంది. ఈ మేరకు పలు ఆయుర్వేద వైద్యశాలల ఎంపిక కోసమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. యోగ, ఆయుర్వేద వైద్యానికి ఎక్కువ ఆదరణ లభిస్తున్న ఈ రోజుల్లో ఈ పథకం అమలయితే ఆయుర్వేద వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. యోగాకు ప్రత్యేకించి ఇన్స్పెక్టరును కూడా నియమించనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details