విధుల నుంచి బీట్ ఆఫీసర్ల తొలగింపు - suspended
కడప జిల్లా ముద్దనూరు ఫారెస్ట్ పరిధిలో సంబంధిత అటవీకూలీలతో చేయించవలసిన పనులను యంత్రాలతో చేయించినందుకు బీట్ ఆఫీసర్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు.
కడప జిల్లా ముద్దనూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అడ్డగోలుగా పనులు చేయించడంపై ఉన్నత అధికారులు చర్యలు చేపట్టారు. మనుషులు చేయాల్సిన పనులను యంత్రాలతో చేయించడం వల్ల ఇద్దరు బీట్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు విధించారు. ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని శెట్టివారిపల్లె, గండ్లూరు బీట్లు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ కొమ్మలను తొలగించడం, చదును చేయడం తదితర పనులను కూలీలతో చేయించాల్సి ఉంది. కానీ, సంబంధిత అటవీ శాఖ సిబ్బంది కూలీలను కాకుండా యంత్రాల సహాయంతో చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు పరిశీలించిన అనంతరం గండ్లూరు ప్లాంటేషన్ బీట్ ఆఫీసర్ శివకుమార్, శెట్టివారిపల్లి బీట్ ఆఫీసర్ కబీర్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు.