ప్రారంభానికి ముస్తాబైన హజ్ హౌజ్ - కమలాపురం
కడపలో ముస్లింల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన హజ్ హౌస్ ను మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ రేపు ప్రారంభించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం కడపలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన హజ్ హౌస్ ప్రారంభానికి ముస్తాబైంది.చెన్నూరు సమీపంలో 25 కోట్ల రూపాయలతో నిర్మించిన హజ్ హౌస్ ను మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ ప్రారంభిస్తారని కమలాపురం నియోజకవర్గ తెదేపా ఇన్ ఛార్జి పుత్తా నరసింహారెడ్డి తెలిపారు. చెన్నూరులోనే 13 కోట్ల రూపాయలతో చేపట్టే భూగర్భ డ్రైనేజీ పనులకు మంత్రులు ఆదినారాయణరెడ్డి, ఫరూక్ శంకుస్థాపన చేస్తారన్నారు. కమలాపురంలో 39 కోట్ల రూపాయలతో నిర్మించే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికీభూమిపూజ చేస్తారన్నారు. హజ్ హౌస్ సందర్భంగా కడపలో ముస్లింల కోసం బహిరంగ సభ ఏర్పాటుచేశారు.