ap crime:
ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. పోలీసుల దర్యాప్తు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థి రవితేజ వసతిగృహంలో ఉరివేసుకుని చనిపోయాడు. మృతుడు అల్లంశెట్టి రవితేజ(19).. శ్రీకాకుళానికి చెందిన వాడని తెలుస్తోంది. ఈ ఘటనపై తాడేపల్లిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తూర్పు గోదావరిలో దారుణం.. వ్యక్తి దారుణ హత్య
తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం గుండాల కాలనీలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు వరదారావును దుండగులు కత్తితో పొడిచి హత్యచేశారు. ఈ హత్యకు భూ వివాదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది.
ప్రకాశం బ్యారేజీపై రోడ్డుప్రమాదం.. ఎగిరి నదిలో పడి మృతి
కడప జిల్లా వేంపల్లె మండలంలోని వీరన్నగట్టుపల్లె బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వేంపల్లెకు చెందిన జగదీష్ (25) అనే యువకుడు మృతి చెందాడు. వేంపల్లెలోని కాలేజి రోడ్డులో నివాసం ఉన్న జగదీష్ డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దాదాపు 6 సంవత్సరాల క్రితం ఇడుపులపాయలో శాంతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆదివారం రాత్రి వేంపల్లె నుంచి ఇడుపులపాయకు బైక్పై వెళ్తుండగా వీరన్నగట్టుపల్లె బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మృతి చెందాడని బంధువులు తెలిపారు. స్థానికులు, బంధువుల సమాచారంతో వేంపల్లె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని వేంప్లలె ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.