ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోతిరెడ్డిపాడు నుంచి నీరు అందించండి' - thulasireddy

వర్షాభావ పరిస్థితుల వల్ల రాయలసీమ, కడప, ప్రకాశం జిల్లాలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి తెలిపారు. నీరు అందాలంటే పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యూలేటర్ల ద్వారా నీరు విడుదల చేయాలన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కృష్ణా బోర్డుతో సంప్రదింపులు జరిపి నీరు అందించాలని కోరారు.

'పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యూలేటర్​ నుంచి నీరు అందించండి'

By

Published : Aug 6, 2019, 11:15 PM IST

'పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యూలేటర్​ నుంచి నీరు అందించండి'

రాయలసీమ, కడప, ప్రకాశం జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. నీరు లేక బోరు బావులు, పొలాలు, పండ్ల తోటలు ఎండిపోతున్నాయన్నారు. పలు గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారని వాపోయారు. సిబిఆర్, పైడిపాలెం, మావి కొండ సర్వరాయసాగర్, అవుకు, బ్రహ్మ సాగర్, కేసీ కెనాల్, గండికోట మొదలగు ప్రాజెక్టులలో నీరు లేక వెలవెలబోతున్నాయని తెలిపారు. పై ప్రాజెక్టులన్నింటికీ నీరు రావాలి అంటే పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్ నుంచి రావలసి ఉంది. కావున త్వరగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కృష్ణా బోర్డుతో చర్చించి నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details