వివేకా హత్య కేసులో అనుమానితులను గుజరాత్‌కు తరలింపు - gujarat
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అనుమానితులకు నార్కో పరీక్షలు చేయడానికి గుజరాత్‌లోని గాంధీనగర్‌కు తరలించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు అనుమానితులను నార్కో అనాలసిస్ పరీక్షల నిమిత్తం గుజరాత్‌కు తరలించారు. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మెన్ రంగన్న, రౌడీషీటర్ శేఖర్‌రెడ్డిని గుజరాత్‌లోని గాంధీనగర్‌కు తీసుకెళ్లారు. వీరి ముగ్గురికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు పులివెందుల న్యాయ స్థానం నుంచి పోలీసులు 10 రోజుల క్రితమే అనుమతి తీసుకున్నారు. నార్కో అనాలసిస్ పరీక్షలు, పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాఫింగ్ వంటి 3 రకాల పరీక్షలను చేయనున్నారు. గుజరాత్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిపుణుల సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.