కడప జిల్లాలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. కడపకు చెందిన వెంకటసుబ్బారెడ్డి ద్విచక్ర వాహనంపై ఒంటిమిట్ట ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా రామాంజనేయపురం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
కడప జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి
కడప జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒంటిమిట్ట ఆలయానికి వెళ్లి తిరిగి వస్తూ ఒకరు.. లాడ్జీలో అనుమానాస్పదంగా మరొకరు... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇంకొకరు మృతి చెందారు.
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతి
కృష్ణా కూడలి వద్ద 17వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో... గాయపడిన మహమ్మద్ హుస్సేన్ చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. పాత బస్టాండ్లోని ఓ లాడ్జిలో ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు విషయం తెలుసుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:స్నేహితుల మధ్య ఘర్షణ... యువకుడు మృతి