ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించి కరోనా వ్యాప్తి నియంత్రణకు కృషి చేయాలని కడప డీఎస్పీ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో సామాజిక దూరం పట్ల అవగహన కల్పించేందుకు పట్టణంలో జాతీయ జెండా చేతబూని... జాతీయ గీతాలప చేశారు. రానున్న 15 రోజులు సామాజిక దూరం పాటిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని ప్రజలకు సూచించారు.
'కరోనా నియంత్రణకు రానున్న 15 రోజులే కీలకం' - కరోనా నియంత్రణపై కడప డీఎస్పీ ప్రచారం
రానున్న 15 రోజులు సామాజిక దూరం పాటిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని కడప డీఎస్పీ సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రతి పౌరుడు సామాజిక దూరం పాటించి కరోనా వ్యాప్తి నియంత్రణకు కృషి చేయాలని కోరారు.
కరోనా నియంత్రణకు రానున్న 15 రోజులు కీలకం