ఆరు నెలల్లో మంచి ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంటానన్న ముఖ్యమంత్రి జగన్,వంద రోజుల్లోనే రద్దుల ప్రభుత్వంగా పేరుతెచ్చుకున్నారని తెదేపా సీనియర్ నేత బత్యాల చంగల్ రాయుడు మండిపడ్డారు.పోలవరం,అమరావతి నిర్మాణం,అన్న క్యాంటీన్లు,ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం,ఉచిత ఇసుక వంటి..ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను రద్దు చేసిన ఘనత జగన్ కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. 100రోజుల పాలనలో144మంది రైతులు ఆత్మహత్యలు, 500మంది తెదేపా కార్యకర్తలపై దాడులు..ఎనిమిది మంది కార్యకర్తల హత్య వంటి అంశాలతో ఘన చరిత్ర సృష్టించాడని ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్ పై మండిపడిన చెంగల్ రాయుడు
ఆరు నెలల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం,కేవలం వంద రోజుల్లోనే రద్దుల ప్రభుత్వంగా మారిందని తెదేపా మాజీ ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు ఆరోపించాడు. పోలీసులను అడ్డుపెట్టుకొని పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తాడు.
జగన్ పాలనపై మండిపడ్డ తెదేపా నాయకులు