వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ను సీబీఐ వేగవంతం చేసి విచారణ ముమ్మరం చేయటంతో ప్రతిపక్షం తెదేపా వైకాపా పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్న తెదేపా నేతలపైనా, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా నెపం నెట్టిన వారు, అధికారంలోకి వచ్చాక నాటి ఆరోపణలు ఎందుకు రుజువు చేయలేకపోయారని నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బంధువుల్ని సీబీఐ విచారణకు పిలుస్తుండటంతో హత్యతో ఆ కుటుంబానికే సంబంధం ఉందని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు.
కోట్ల కోసం సొంత బాబాయిపై గొడ్డలి: లోకేశ్
తన చేతికంటిన నెత్తురుని జగన్ రెడ్డి చంద్రబాబుకు పూశారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కోట్ల కోసం సొంత బాబాయిపై గొడ్డలి వేటు వేశారని ఆరోపించారు. ఓట్ల కోసం ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ.. సొంత పత్రికలో ఆదే గొడ్డలిని గ్రాపిక్స్‌లో చంద్రబాబు చేతిలో పెట్టి మరీ అచ్చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తరతరాల వైఎస్సాసుర రక్త చరిత్ర అంతా నేరాలమయం అని మరోసారి సీబీఐ దర్యాప్తుతో తేటతెల్లమైందని దుయ్యబట్టారు. ఫ్యాక్షన్ జగన్ రెడ్డి బ్లడ్ గ్రూప్ అన్న లోకేశ్.. అరాచకాలకు వైఎస్ కుటుంబం చిరునామా అని ఆక్షేపించారు. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలపై వైఎస్ కుటుంబానికి పేటెంట్ హక్కులున్నాయని మండిపడ్డారు. అదే కుటుంబానికి చెందిన వివేకా హత్యే వైఎస్ వంశ చరిత్రకి తాజా సాక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కర్నీ సీబీఐ పిలిపిస్తుంటే.. అది ఇంటి గొడ్డలేనని.. సొంతింటి వేటకొడవలే వివేకాని వెంటాడిందని స్పష్టమవుతోందన్నారు. డబ్బు, ఆధిపత్యం, గనులు, అక్రమాల కోసం సొంత బాబాయినే మట్టుబెట్టిన వైఎస్ఆర్ కుటుంబ రక్త చరిత్రని జగన్ సొంత పత్రికలో ఎలా అచ్చేస్తారో చూస్తానని ట్వీట్ చేశారు. ‘నారాసుర రక్త చరిత్ర’ అనే శీర్షికతో ఓ పత్రికలో ప్రచురితమైన కథనాలను ట్వీట్‌కు జతచేశారు.
విజయసాయిరెడ్డి పల్స్‌రేట్ పడిపోతుంది: బుద్ధా వెంకన్న