ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోంది'

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని తేదేపా రాజంపేట పార్లమెంట్ ఇన్​ఛార్జి ఆర్​. శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో తుగ్లక్​ పాలన కొనసాగుతున్నట్లు రాజధాని మార్పు విషయంతో అర్థమవుతుందని విమర్శించారు.

By

Published : Oct 10, 2020, 6:02 PM IST

'రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన కొనసాగుతోంది'
'రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన కొనసాగుతోంది'

రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి తెచ్చే రాజధాని అవసరమని విభజన అనంతరం అమరావతినే రాజధానిగా చేశారని తెదేపా నేత ఆర్.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటిలో పలువురు మైనార్టీ మహిళలు తేదేపాలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని మార్చాలని నిర్ణయించడం తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు. విశాఖపట్నంలో వైకాపా నాయకులు స్థలాలు కొనుగోలు చేసి వాటి ద్వారా లబ్ధి పొందడానికి రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

అంతకుముందు రాయచోటి పట్టణానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త ఆమెకు జరిగిన అన్యాయాన్ని, వైకాపా నాయకులు తనపై పెట్టిన కేసును శ్రీనివాస్​రెడ్డికి వివరించారు. రాయచోటిలో వైకాపా నేతల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని ఆరోపించారు.

ఇదీ చదవండి:దర్శకుడు రాజమౌళిపై 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఫిర్యాదులు!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details