ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోను సమర్థిస్తున్నామని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. రాయలసీమ వాసుల కోసం ఎవరు పోరాటం చేసినా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
పోతిరెడ్డిపాడు విస్తరణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకూలం కాదని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం అవసరమైతే సుప్రీం కోర్టులో పోరాడాలని సూచించారు.