రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించడమే ఆరు నెలల్లో ప్రభుత్వం సాధించిన విజయమని తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే రాజధాని అమరావతి మార్పునకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని కడపలో నిర్వహించిన విపక్షాల రౌండ్ టేబుల్ సమావేశంలో ముక్తకంఠంతో నేతల వైఖరిని స్పష్టం చేశారన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు రాజధాని మార్చడంపై నోరు మెదపడం లేదని... ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి జరుగుతున్న పరిణామాలు వదిలేసి గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని తరలిస్తే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రైతులు, మహిళలపై పోలీసులు కిరాతకంగా వ్యవహరించడం అహంకార పాలనకు నిదర్శనమన్నారు. ఈ నెల 18న అన్ని పార్టీల నేతలతో రాయచోటిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.
'రాజధాని తరలిస్తే... రాయలసీమకు అన్యాయం జరుగుతుంది'
రాష్ట్రంలో అల్లకల్లోలం జరుగుతుంటే... జిల్లాలోని ఎమ్మెల్యేలు,ఎంపీలు నోరు మెదపటం లేదని... జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. రైతులు, మహిళలపై పోలీసులు కిరాతకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని మార్పు ప్రభుత్వ కుట్రలో భాగమేనని విమర్శించారు.
రాజధానిపై తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసురెడ్డి వ్యాఖ్య