గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థులకు చదువు తప్ప ఇతర రంగాల్లో పెద్దగా ప్రవేశం ఉండదు. సౌకర్యాలు అందుబాటులో ఉండక పోవడం, తదితర కారణాల వల్ల గ్రామీణ విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యను అందుకోలేకపోతున్నారు. అలాంటి వారికి చేయూతనిస్తూ వేసవి సెలవులను వినియోగించుకునేలా గ్రామీణాభివృద్ధి సంస్థ అండగా ఉంటుంది.
అత్యాధునిక శిక్షణ...
కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడులో మాయలూరు పార్వతి రామకృష్ణారెడ్డి గ్రామీణాభివృద్ధి సంస్థ విద్యార్థులకు నైపుణ్య తరగతులను నిర్వహిస్తోంది. అత్యాధునిక వసతులు, అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ వేసవి సెలవులను ఆడుతూ పాడుతూ నేర్చుకునేలా శిక్షణ ఇప్పిస్తోంది. కంప్యూటర్ పరిజ్ఞానం, మట్టితో, కాగితాలతో బొమ్మలు తయారు చేయడం, డ్రాయింగ్ , నృత్యాలు ఇలా అన్ని రంగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు.