ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో పక్కదారి పట్టిన ఉలవలు! - subsidy horse gram

కరవు ప్రాంతంలో వర్షాధారం కింద సాగు చేసుకునేందుకు ప్రభుత్వం రైతులకు ఉచితంగా సరఫరా చేసిన ఉలవలు పక్కదారి పట్టాయి. పది రోజులుగా పట్టాదారు పాసు పుస్తకాలు చేతపట్టుకుని క్యూలైన్లలో వేచి ఉండి బయోమెట్రిక్ ద్వారా తెచ్చుకున్న ఉలవలను కొందరు పోగుచేసి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ.. పట్టుబడ్డారు .

కడప జిల్లాలో పక్కదారి పట్టిన ఉలవలు...15 బస్తాలు స్వాధీనం

By

Published : Sep 14, 2019, 8:25 PM IST

Updated : Sep 14, 2019, 11:46 PM IST

కడప జిల్లా సుండుపల్లెలోని వ్యవసాయ కార్యాలయ సమీపంలో అక్రమంగా తరలిస్తోన్న ఉలవల బస్తాలను స్థానికులు పట్టుకున్నారు. రాయచోటికి చెందిన కొందరు వ్యాపారులు ఆటోలో వేసుకుని అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకున్నారు. ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారని... రైతులకు ఇవ్వాల్సిన ఉలవలు కిలోల కొద్దీ బయటికి వెళ్లడం ఎలా సాధ్యం అంటూ తరలిస్తున్న వారిని ప్రశ్నించారు. అనుమానాస్పద సమాధానం రావటం... సంచులపై ప్రభుత్వం ముద్రించిన సమాచారం ఉంది. ప్రభుత్వ అందించే... ఉలవలు బ్లాక్ మార్కెట్ తరలి పోతున్నాయని అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సుండుపల్లె పోలీసులు రంగంలోకి దిగి 15 బస్తాలను స్వాధీనం చేసుకొని తరలిస్తున్న వారిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

కడప జిల్లాలో పక్కదారి పట్టిన ఉలవలు!
Last Updated : Sep 14, 2019, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details