ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూతన ఉద్యోగ క్యాలెండర్​ విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నిరసన

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్​ను తక్షణమే రద్దు చేయాలని.. కడప జిల్లాలో విద్యార్థులు నిరసన చేపట్టారు. నిరుద్యోగ యువతకు ఉపయోగపడని క్యాలెండర్​ను రద్దుచేసి పూర్తి ఖాళీల వివరాలతో నూతన క్యాలెండర్​ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

students unions protest at kadapa demanding to release new job calender
నూతన ఉద్యోగ క్యాలెండర్​ విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నిరసన

By

Published : Jun 28, 2021, 7:41 PM IST

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్​ను.. తక్షణమే రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపయోగపడని క్యాలెండర్​ను రద్దుచేసి నూతన క్యాలెండర్​ విడుదల చేయాలని కోరుతూ.. కడప జిల్లాలో ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నట్టేట ముంచుతోందని ఆరోపణలు చేశారు. రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు విడుదల చేస్తామని చెప్పిన ఆయన.. కేవలం 10 వేల ఉద్యోగాలు జాబితా విడుదల చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి.. కొత్త ఉద్యోగ క్యాలెండర్​ను విడుదల చేయాలని.. లేదంటే ఈనెల 30న అమరావతిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details