ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దిల్లీలో రైతు ఉద్యమానికి మద్దతుగా విద్యార్థి సంఘాల ర్యాలీ

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా విద్యార్థి సంఘాలు ఈ నెల 24న మద్దిలపాలెం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నాయి. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఈ రోజు విడుదల చేశాయి.

By

Published : Jan 19, 2021, 4:32 PM IST

Published : Jan 19, 2021, 4:32 PM IST

ryaly
దిల్లీలో రైతులకు మద్దతుగా విద్యార్థి సంఘాల ర్యాలీ

దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా విశాఖలో ఈనెల 24న లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను ఇవాళ జీవీఎంసీ గాంధీ పార్కులో ఎస్​ఎఫ్​ఐ, డీవైఎఫ్​ఐ విద్యార్థి సంఘం నాయకులు విడుదల చేసారు. మైనస్ డిగ్రీల చలిని తట్టుకొని రైతులు తమ న్యాయమైన సమస్యల కోసం పోరాటాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. కేంద్రం తీరును ఎండగడుతూ రైతులకు మద్దతుగా మద్దిలపాలెం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు.

మైదుకూరులో మహిళల ఆందోళన...

వ్యవసాయ విద్యుత్ చట్టాల రద్దు కోరుతూ కడప జిల్లా మైదుకూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలు ఆందోళన చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ అటు రైతులు.. ఇటు కార్మికులకు కడుపు కొడుతుందని ఆరోపించారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని.. కేంద్రం నూతన వ్యవసాయ శాఖ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.

ఇదీ చదవండి:వెంకుపాలెంలో అగ్నిప్రమాదం.. గడ్డివాములు దగ్ధం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details