ఆహారం కలుషితం... 60 మంది విద్యార్థులకు అస్వస్థత - students
రాయచోటిలోని గిరిజన సంక్షేమ వసతిగృహంలో ఆహారం కలుషితమైంది. ఆ విషాహారం తిని 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
students affected with food poison
వసతి గృహాల్లో నిర్లక్ష్యం కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. కడప జిల్లా రాయచోటిలోని గిరిజన సంక్షేమ వసతిగృహంలో ఆహారం కలుషితమైంది. 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. వసతి గృహ అధికారులు... తమ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనిఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.