ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోపాలమిత్రలు.. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు

రాష్ట్ర వ్యాప్తంగా గోపాలమిత్రల ధర్నా మిన్నంటుతోంది. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లోకి తమనే తీసుకోవాలంటూ ఎక్కడిక్కడ విధులను బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నారు.

By

Published : Aug 1, 2019, 5:06 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా గోపాల మిత్రుల ధర్నా

రాష్ట్ర వ్యాప్తంగా గోపాల మిత్రుల ధర్నా

పశు సంవర్ధక శాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమకే... గ్రామ సచివాలయాల్లో అవకాశం కల్పించాలని కోరుతూ గోపాలమిత్రులు ధర్నాచేస్తున్నారు.

విజయవాడలో...

విజయవాడ ధర్నాచౌక్​లో ఏపీ గోపాలమిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కీలక పాత్ర వహించిన గోపాల మిత్రులను ఉన్న ఫళంగా తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గోపాల మిత్రులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీని.. ఇప్పుడు అమలు చేయాలని కోరారు.

కాకినాడలో....

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద గోపాలమిత్రలుగా పనిచేస్తున్నవారంతా ధర్నాకు దిగారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. పదవ తరగతి చదివిన గోపాలమిత్రలకు పశుసంవర్ధక శాఖ ద్వారా అవసరమైన సాంకేతిక శిక్షణ ఇచ్చిన గ్రామ సచివాలయాల్లో నియమించాలన్నారు.

కడపలో....

కడప కలెక్టరేట్ ఎదుట గోపాలమిత్రలు ఆందోళన చేపట్టారు. కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయం పేరిట తమ స్థానంలో వేరే వారిని నియమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ సచివాలయాల్లో తమకూ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి ఎండుతున్న కుందూ... అడుగంటుతున్న భూగర్భ జలాలు

ABOUT THE AUTHOR

...view details