రాష్ట్రంలో నాడు-నేడు రెండో విడతలో భాగంగా... రూ.4,400 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, భవిత కేంద్రాలు, ఎయిడెడ్ పాఠశాలలు, ఎమ్మార్సీ, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.వీరభద్రుడు తెలిపారు. కడప జిల్లా రాజంపేట మండలంలోని తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి, గ్రామంలోని శివకేశవుల ఆలయాలను ఆయన సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
రూ.4,400 కోట్లతో రెండో విడత నాడు నేడు పనులు : వీరభద్రుడు - nadu nedu second stage
కడప జిల్లా తాళ్లపాకలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.వీరభద్రుడు పర్యటించారు. అన్నమాచార్యుల జన్మస్థలి, గ్రామంలోని ఆలయాలను సందర్శించారు. రాష్ట్రంలో నాడు-నేడు రెండో విడతలో ప్రభుత్వం రూ.4,400కోట్లతో విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.వీరభద్రుడు
నాడు-నేడు మొదటి విడతలో చేపట్టిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని కమిషనర్ వీరభద్రుడు తెలిపారు. గతేడాదితో పోల్చుకుంటే కరోనా సమయంలోనూ ప్రభుత్వ పాఠశాలలో 5.5 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరినట్లు వివరించారు. అమ్మఒడి పథకం ద్వారా తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు కోరుకుంటే నగదు బదులు లాప్టాప్లు అందిస్తామని వెల్లడించారు.
ఇవీచదవండి.