ETV Bharat / state
నేటి నుంచి శ్రీనారా పుర వెంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు - శ్రీ నారా పుర వెంటేశ్వర స్వామి ఆలయం
కడప జిల్లాలో ఉన్న శ్రీ నారా పుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేశారు.
పవిత్రోత్సవాలకు సర్వం సిద్ధం
By
Published : Sep 8, 2019, 6:33 AM IST
| Updated : Sep 8, 2019, 10:29 AM IST
పవిత్రోత్సవాలకు సర్వం సిద్ధం కడప జిల్లా జమ్మలమడుగులో వెలసిన శ్రీనారా పుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వైదిక సంప్రదాయం ప్రకారం అన్య వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికులు, సిబ్బంది, భక్తుల వలన తెలిసీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి పరిణామాల వలన ఆలయ పవిత్రతకు ఎటువంటి లోపం రానివ్వకుండా ఏటా మూడు రోజులపాటూ ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 8,9,10 తేదీల్లో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. ఈ మూడు రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు. Last Updated : Sep 8, 2019, 10:29 AM IST