దసరా పండుగకు వచ్చిన వారందరూ తిరుగు ప్రయాణం అయ్యారు. వారి కోసం కడప జిల్లా ఆర్టీసీ అధికారులు జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో ఇవాళ ఒక్కరోజు 80 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నారు. మధ్యాహ్నం నుంచి ప్రయాణికుల రద్దీ మొదలైంది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, నగరాలతోపాటు తిరుపతి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు తదితర ప్రాంతాలకు వెళ్లే వారితో కడప ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడుతోంది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు అనుగుణంగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామని ఆర్ టీ సీ అధికారులు తెలిపారు.
కడప జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు.. 50శాతం అదనపు ఛార్జీలు - దసరా
దసరా పండుగకు వచ్చిన వారు తిరుగు ప్రయాణమయ్యేందుకు కడప జిల్లా ఆర్టీసీ అధికారులు 8 డిపోల పరిధిలో ఇవాళ ఒక్కరోజు 80 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నారు. ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
కడప డిపో