కడప జిల్లా చక్రాయపేట మండలం బీఎన్ తాండాలో తండ్రని కుమారుడు హతమార్చాడు. తవరాయ్ నాయక్ తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ పడుతూ ఉండేవాడు. గురువారం జరిగిన ఘర్షణలో తండ్రి నాగుల నాయక్‌ను కర్రతో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడిని బంధువులు వేంపల్లె ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కారణంగా... తిరుపతికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మార్గమధ్యంలో నాగులు నాయక్ చనిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కొడుకుతో ఘర్షణ.. తండ్రి ప్రాణం తీసింది - kadapa
కొడుకుతో జరిగిన ఘర్షణ.. తండ్రి ప్రాణం పోయేలా చేసింది. కడప జిల్లాలో ఈ ఘోరం జరిగింది.
గొడవ