జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పే సమయంలో దుండగులు దాడులకు పాల్పడడం సరికాదని కడప జిల్లా భాజపా అధికార ప్రతినిధి సురేష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మైలవరం మండలం సమీపంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సోలార్ విద్యుత్ ఫలకలను దుండగులు ధ్వంసం చేయటం దారుణమన్నారు. దాదాపు 1700 పలకలను పగలగొట్టడం వల్ల మూడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే జిల్లాలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికులు ఆసక్తి చూపుతున్న సమయంలో ఇలా దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
'సోలార్ ఫలకలు ధ్వంసం చేయటం దారుణం' - kadaopa ja
పరిశ్రమల రాకతో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న కడప జిల్లాలో సోలార్ విద్యుత్ ఫలకలను దుండగులు ధ్వంసం చేయటాన్ని భాజపా జిల్లా అధికార ప్రతినిధి సురేష్ కుమార్ రెడ్డి ఖండించారు. ఇలాంటి చర్యల ద్వారా పరిశ్రమల రాక ఆగిపోయే ప్రమాదముందన్నారు.
కడప జిల్లా భాజపా అధికార ప్రతినిధి సురేష్ కుమార్ రెడ్డి