అత్యంత కరవు ప్రాంతమైన రాయలసీమ జిల్లాలకు నీటి కోటాల చట్టబద్దత కల్పించాలని సీనియర్ రాజకీయ నేత మైసూరారెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్ డిమాండ్ చేశారు. పోలవరం జలాశయం, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కృష్ణా ఆయకట్టుకు నీరిచ్చి, శ్రీశైలం నీటిని పూర్తిగా రాయలసీమ జిల్లాకు మళ్లించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు పూర్తిస్థాయిలో అమలు కావడంలేదన్నారు. రాయలసీమ జిల్లాలకు నీటి కేటాయింపులు జరిగేలా ఒప్పించాలని డిమాండ్ చేశారు.
రాయలసీమ జిల్లాలకు నీటి కోటాల చట్టబద్దత కల్పించాలి - shailajanath, ex minister
రాయలసీమ జిల్లాలకు నీటికోటాల చట్టబద్ధత కల్పించాలని సీనియర్ రాజకీయ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నందున రాయలసీమ జిల్లాలకు నీటి కేటాయింపులు జరిగేలా ఒప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నీటి కోటాల చట్టబద్దత కల్పించాలి