దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనా దళితవాడల్లో మౌలిక సదుపాయాలు లేవని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలోని దండోరా కాలనీనీ పరిశీలించిన ఆయన... వసతులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే మౌలిక సమస్యలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్డీఓకు సూచించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని అధికారులుకు బదలాయించారు.
''దళిత వాడల్లో మౌలిక వసతులు కల్పించరా?'' - sc
కడపలోని దండోరా కాలనీలో.. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు శ్రీరాములు పర్యటించారు. కనీస సదుపాయలు లేవని అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కడపలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు శ్రీరాములు