సంరక్షణ కరవు.. ఎండిపోతున్న మొక్కలు - ఆరోగ్య సమస్యలు
చెట్లు.. మానవాళికి జీవనాధారం. ప్రాణవాయువు నిచ్చే చెట్లను ఎక్కడా బతకనీయడం లేదు. ప్రభుత్వం ఏటా మొక్కలు మొక్కుబడిగా నాటి వాటి బాధ్యత పూర్తిగా విస్మరిస్తోంది.
కడప జిల్లా బద్వేలు పురపాలిక లో 26 వార్డులు ఉన్నాయి. వనం మనం పేరిట ఈ ఏడాది పది వేల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా అందులో 500 మొక్కలు మొదటి విడతగా నాటామని పురపాలక కమిషనర్ విజయసింహారెడ్డి అన్నారు. అయితే డివైడర్పై నాటిన మొక్కల సంరక్షణకు నోచుకోవటం లేదు. ఫలితంగా వాహనాల నుంచి వెలువడే పొగతో వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి, బద్వేలు పురపాలికను కాలుష్యం బారినుండి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.