ఇసుక క్వారీలో నిర్వహణ లోపం కారణంగా గందరగోళం ఏర్పడింది. కడప జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది ట్రాక్టర్లు బారులు తీరాయి. ఫలితంగా రాకపోకలు స్తంభించిపోయి ఎక్కడి ట్రాక్టర్లు అక్కడే నిలిచిపోయాయి. కడప జిల్లా రాజంపేట మండలం శేషమాంబాపురంలో ఇసుక క్వారీ ఉంది. జిల్లాలో రెండు ప్రాంతాల్లో మాత్రమే ప్రభుత్వం క్వారీలకు అనుమతివ్వడంతో కడప, రాయచోటి, బద్వేలు, రైల్వేకోడూరు నుంచి వందలాదిగా ట్రాక్టర్లు క్వారీ వద్దకు వచ్చాయి. జిల్లాలో ఇసుక క్వారీని రద్దుచేసి కొత్త ఇసుక విధానాన్ని సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో సమస్య తీవ్రమైంది. తెల్లవారుజామునే 5 గంటలకు వచ్చిన ట్రాక్టర్లు మధ్యాహ్నం 12 గంటలకు కూడా క్వారీ నుంచి బయటికి పోలేని పరిస్థితి ఏర్పడింది. ఆహారం లేక ఇబ్బంది పడాల్సి వస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించేందుకు తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి రంగంలోకి దిగారు. ట్రాక్లర్లను అక్కడి నుంచి పంపేశారు. రాజంపేట ప్రాంతంలో ఒకటే క్వారీ ఉండడంతో సమస్య ఏర్పడిందని, త్వరలో కొత్త క్వారీలు మంజూరు కానున్నట్లు తహసీల్దార్ తెలిపారు.
ఇసుక కోసం పాట్లు... బారులు తీరిన ట్రాక్టర్లు - drivers agitation
కడప జిల్లా శేషమాంబపురంలో ఇసుక క్వారీ ఉంది. నిర్వహణ లోపం కారణంగా పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు బారులు తీరటంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇసుక ట్రాక్టర్లు